Janhvi Kapoor Tamil: తమిళంలో మాట్లాడి కోలీవుడ్ ను సర్ప్రైజ్ చేసిన జాన్వీ కపూర్
ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం "దేవర". ఈచిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ప్రమోషన్స్‌లో భాగంగా కోలీవుడ్‌లో ప్రచారం చేస్తున్నారు. తారక్ కు తెలుగు సహా అనేక భాషల్లో మాట్లాడడం వచ్చు.తమిళ్‌లో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. అయితే, ఇటీవల జాన్వీ కపూర్ తమిళ్‌లో చాలా అందంగా మాట్లాడి,తమిళ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఆమె తమిళంలో అనర్గళంగా మాట్లాడారని,సోషల్ మీడియాలో జాన్వీకి అనుకూలంగా ఉన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈవిధంగా కోలీవుడ్ ఆడియెన్స్ నుండి జాన్వీ కపూర్ మంచి అటెన్షన్ సంపాదించింది."దేవర"చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.