Page Loader
వీడియో: ఎన్టీఆర్ పై జపాన్ మంత్రి కామెంట్స్ వైరల్ 
ఎన్టీఆర్ అంటే అభిమానం అంటున్న జపాన్ మంత్రి

వీడియో: ఎన్టీఆర్ పై జపాన్ మంత్రి కామెంట్స్ వైరల్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 28, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో జూనియర్ ఎన్టీఆర్ పై జపాన్ దేశ ప్రజలు ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తుంటారు. ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తూ యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తుంటారు. తాజాగా జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రి యోషిమాసా హయాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసారు. ఇటీవల ఇండియాకు వచ్చిన హయాషి, భారతీయ సినిమా రంగం గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ దేశం ఎంతగానో ఆదరిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో, ఆర్ఆర్ఆర్ హీరోల్లో ఏ హీరో ఇష్టమని ఒక జర్నలిస్ట్ అడగడంతో రామారావు జూనియర్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అదలా ఉంచితే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్టీఆర్ అంటే అభిమానం అంటున్న జపాన్ మంత్రి