Page Loader
Jatwani: విజయవాడ సీపీ కీలక ప్రకటన.. బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీకి భద్రత పెంపు 
విజయవాడ సీపీ కీలక ప్రకటన.. బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీకి భద్రత పెంపు

Jatwani: విజయవాడ సీపీ కీలక ప్రకటన.. బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీకి భద్రత పెంపు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు. విద్యాసాగర్‌ను అర్ధరాత్రి విజయవాడకు తీసుకొచ్చి, సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ముంబయి నటి జత్వానీ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. జత్వానీకి అవసరమైన భద్రతను కూడా కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు.