షారుక్ ఖాన్ జవాన్ సినిమాకు బంగ్లాదేశ్ లో లైన్ క్లియర్
ఈ వార్తాకథనం ఏంటి
షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా విడుదలకు బంగ్లాదేశ్ లో అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నుండి జవాన్ సినిమాకు క్లియరెన్స్ రాలేదు.
బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా జవాన్ సినిమాను రిలీజ్ చేయలేమంటూ అక్కడి అధికారులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.
గతంలో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కూడా బంగ్లాదేశ్ లో కొన్ని రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఇప్పుడు జవాన్ కూడా అలాగే విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు అనుకున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ జవాన్ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చింది.
Details
మొదటిరోజు 150కోట్ల వసూళ్ళు సాధించిన జవాన్
జవాన్ సినిమాకు బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో రాసుకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రిలీజ్ అయిన జవాన్ సినిమా బంగ్లాదేశ్ లో కూడా రిలీజ్ అవుతోంది.
నిన్న రిలీజ్ అయిన జవాన్ సినిమాకు తొలి రోజులోనే 150కోట్ల బస్సులు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మాస్, యాక్షన్, మసాలా దట్టించిన జవాన్ సినిమా అటు నార్త్ ప్రేక్షకులను ఇటు సౌత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా కనిపించింది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.