Srinivasa Mangapuram: జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అవుతున్నారు. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. తాజాగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను మహేస్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, జయకృష్ణకు ఆశీస్సులు అందించారు.
వివరాలు
విలన్ పాత్రలో మోహన్ బాబు
వాసు బాబు (జయకృష్ణ), మంగా (రాషా తడానీ) అనే ఇద్దరు స్నేహితుల మధ్య చిగురించిన ప్రేమ, వారి జీవితాల్లో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హీరో జయకృష్ణ తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుండగా, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఇక ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణగా కలెక్షన్ కింగ్ మహేష్ బాబు విలన్ పాత్రలో కనిపించనుండటం విశేషం. టీజర్‌లో ఆయన కనిపించిన తీరు కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తంగా ట్రెండీ రొమాన్స్‌తో పాటు ఇంటెన్స్ యాక్షన్‌ను కలగలిపి దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని ఆకట్టుకునేలా మలిచారు