Jayam Ravi: జయం రవి షాకింగ్ నిర్ణయం.. కోలీవుడ్ నిర్మాతల్లో టెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
జయం రవి 'పొన్నియిన్ సెల్వన్', ధ్రువ (తమిళంలో 'తని ఒరువన్') వంటి చిత్రాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఆయన వ్యక్తిగత జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయం రవి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన విడాకుల ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తయ్యే వరకు సినిమాల్లో నటించలేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన సినిమాల విడుదలలను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతున్నట్లు వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
వివరాలు
నా కెరీర్ లో 90శాతం సినిమాలు విజయవంతమయ్యాయి
"గత 23 ఏళ్లుగా నేను రాత్రింబగళ్లు కష్టపడి పనిచేశాను. నా కెరీర్‌లో 90 శాతం సినిమాలు విజయవంతమయ్యాయి. కానీ గత రెండేళ్లుగా నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారం నా మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీసింది. చట్టపరంగా నా విడాకులు పూర్తయ్యే వరకు నేను నటించలేను. ప్రస్తుతం నా వల్ల కావడం లేదంటూ జయం రవి భావోద్వేగంతో తెలిపారు.
వివరాలు
దాదాపు రూ.150 కోట్లతో పలు ప్రాజెక్టులు
జయం రవి ఆకస్మికంగా సినిమాలకు విరామం ప్రకటించడం తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. విడాకుల కేసు పూర్తయ్యే వరకు తన సినిమాలను హోల్డ్‌లో పెట్టాలని ఆయన పట్టుబడుతుండటంతో తమిళ బాక్సాఫీస్‌పై భారీ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న పలు క్రేజీ ప్రాజెక్టులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
వివరాలు
ఒరువన్ 2 మూవీ భవిష్యత్తు ప్రశ్నార్థకం
ముఖ్యంగా కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఫాంటసీ డ్రామా జీనీతో పాటు, టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తని ఒరువన్ 2 భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదం పూర్తిగా ముగిసే వరకు తాను సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొననని జయం రవి స్పష్టం చేయడంతో నిర్మాతలు, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.