Page Loader
Jigarthanda Double X : ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జిగర్ తండ డబుల్ ఎక్స్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జిగర్ తండ డబుల్ ఎక్స్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jigarthanda Double X : ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జిగర్ తండ డబుల్ ఎక్స్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2023
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్.(jigarthanda double x). కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 'జిగర్ తండ'కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్దమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా డిసెంబర్ 8 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

Details

ఇంగ్లీష్ లోనూ ప్రసారం కానున్న మూవీ

ఈ సినిమా నవంబర్ 10న గ్రాండ్‌గా రిలీజై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఇంగ్లిషులోనూ ఈ మూవీ ఈ ప్రసారం కానుంది. ఇక మొద‌టి పార్ట్ లాగానే జిగర్తాండ డబుల్ ఎక్స్ కూడా రౌడీకి, దర్శకుడికి మధ్య జరిగే సంఘర్షణ చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా కథ 1975 నాటి రెట్రో స్టైల్‌లో సాగుతుంది. స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన‌ ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతాన్ని సమకూర్చాడు.