Jio Hotstar: 'సౌత్ అన్‌బౌండ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జియో హాట్‌స్టార్.. 18 కొత్త ప్రాజెక్టుల ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ దక్షిణాది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో కొత్త కంటెంట్‌ను పరిచయం చేస్తోంది. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌కు 'సౌత్ అన్‌బౌండ్' అని పేరు పెట్టి, మొత్తం 18 తాజా ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, మోహన్ లాల్, నాగార్జున వంటి సినీ దిగ్గజాలు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుక వేదికగా రాబోయే వెబ్ సిరీస్‌లు, సినిమాలపై హాట్‌స్టార్ ఆసక్తికర వివరాలను వెల్లడించింది. అందులో భాగంగా 'ఫార్మా' అనే వెబ్ సిరీస్‌ను డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.
వివరాలు
'సేవ్ ది టైగర్స్ 3' సహా పలు విజయవంతమైన సిరీస్‌లకు సీక్వెల్స్ ప్రకటన
అంతేకాకుండా, తెలుగులో మంచి ఆదరణ పొందిన 'సేవ్ ది టైగర్స్'కు కొనసాగింపుగా సీజన్-3ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఇవేకాక 'కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 3', 'కజిన్స్ అండ్ కల్యాణమ్స్', 'అనాలీ', 'రాసిన్', '1000 బేబీస్ సీజన్ 2', 'విక్రమ్ ఆన్ డ్యూటీ', 'వరమ్', 'బ్యాచ్‌మేట్స్' వంటి మరెన్నో సిరీస్‌లను సమీప భవిష్యత్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రణాళికలను సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల్లో కొన్నిపూర్తిగా సరికొత్త కథాంశాలతో రూపొందుతున్నవీ కాగా, మరికొన్నివి ఇప్పటికే ప్రేక్షకుల మెప్పు పొందిన సిరీస్‌లకు కొనసాగింపులుగా తెరకెక్కుతున్నవీ కావడం విశేషం. వీటికి సంబంధించిన ఆకర్షణీయమైన ప్రోమోలను కూడా ఈ సందర్భంగా విడుదల చేసి ఉత్సాహాన్ని పెంచారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జియోహాట్ స్టార్ చేసిన ట్వీట్
Different languages, one iconic moment; Bigg Boss in all its glory!#SouthUnbound #JioHotstarSouthUnbound #JioHotstar pic.twitter.com/ZSXf2K8EmZ
— JioHotstar (@JioHotstar) December 9, 2025