
John Abraham : జాన్ అబ్రహం హీరోగా 'ఫోర్స్-3'.. హీరోయిన్‌గా టాలీవుడ్ అందాల భామ
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం మళ్లీ తన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ 'ఫోర్స్ 3'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి 'ఖాకీ: ది బీహార్ స్టోరీ' వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు భవ్ ధూలియా ఈ చిత్రానికి మెగాఫోన్ వహించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం జాన్, రాకేష్ మారియా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఫోర్స్ 3' చిత్రీకరణ మొదలు పెట్టే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో జాన్‌కి ఎదురుగా ఒక పవర్‌ఫుల్ యాక్టర్‌ని తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. 'ఫోర్స్ 1'లో జాన్-విద్యుత్ జమ్వాల్ మధ్య జరిగిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Details
మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు సమాచారం
అదే తరహాలో 'ఫోర్స్ 3'లో కూడా ఇలాంటి పవర్‌ఫుల్ ఫేస్‌ఆఫ్‌ను చూపించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ భామ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం. జాన్ అబ్రహంతో కలిసి ఆమె స్క్రీన్‌పై రొమాన్స్ చేయనుంది. 2011లో వచ్చిన 'ఫోర్స్ 1'ను గుర్తు చేసుకుంటే—జాన్ అబ్రహం ఇందులో యశ్ వర్ధన్ అనే హార్డ్‌కోర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ముంబైలో డ్రగ్ మాఫియాను అణచివేయడానికి కట్టుబడి పనిచేసే ఒక సత్సంకల్పం గల అధికారి పాత్రను పోషించాడు.
Details
'ఫోర్స్ 3' కోసం అభిమానుల ఎదురుచూపులు
అతని టీమ్‌లోని మిగతా అధికారులను హతమారుస్తున్న ఒక డేంజరస్ గ్యాంగ్‌స్టర్‌ను అడ్డుకోవడమే కథ ప్రధానాంశం. చివరికి యశ్ వర్ధన్ ఆ గ్యాంగ్‌ను ఎలా నిర్మూలించాడు అనేదే సినిమా హైలైట్. 'ఫోర్స్ 1' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. జాన్ అబ్రహం యాక్షన్, స్టైల్, పెర్ఫార్మెన్స్‌తో పాటు గ్రిప్పింగ్ స్టోరీ ఈ సినిమాకు సక్సెస్ కారకాలు అయ్యాయి. అదే స్థాయి అంచనాలతో ఇప్పుడు 'ఫోర్స్ 3' కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.