Page Loader
NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆ రోజే
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆ రోజే

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆ రోజే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2024
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి రెండళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి తెరపైన కనిపించలేదు. దేవర సినిమా కూడా సెప్టెంబర్ కు వాయిదా పడింది. ఇక దేవర సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రశాంత్ నీల్‌తో చేయబోయే ఎన్టీఆర్ 31పై కీలక అప్డేట్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మొదటి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేకుండానే ప్రాజెక్టును ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారట.

Details

త్వరలో అధికారిక ప్రకటన

త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను దర్శకుడు పరిశీలిస్తున్నారు. ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదో మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంతో ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆ మూవీ నుంచి వచ్చిన ఫియర్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.