JR NTR: 'దేవర 'పార్ట్ 2 షూటింగ్ అప్పుడే నుంచే స్టార్ట్.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.!
దేవర మూవీ కలెక్షన్లను దుమ్మురేపుతోంది. తాజాగా థియేటర్లలో 'దావూదీ' సాంగ్ కలర్ యాడ్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. 'ట్రిపుల్ ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు హిట్ వస్తుందా? అన్న ప్రశ్నకు ఇక సమాధానం దొరికింది. ఇప్పుడు అభిమానులు తారక్ సెకండ్ పార్ట్ ఎప్పుడు ప్రారంభిస్తాడో అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తారక్ అభిమానుల గురించి మాట్లాడుతూ,"మీరు చూపిస్తున్న ప్రేమకు ఈ జన్మలో నేను ఇస్తున్నది కేవలం వడ్డీ మాత్రమే," అంటూ అభిమానులకు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మాట ఎక్కడ అన్నారు? అనుకుంటున్నారా,ఇది దేవర సక్సెస్ సెలబ్రేషన్స్‌లో జరిగింది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన కారణంగా,సినిమా విడుదల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ వేడుకలు జరపాలని నిర్ణయించుకున్నారు.
చిత్ర యూనిట్‌తో తారక్
కానీ, దసరా నవరాత్రులు జరుగుతుండటంతో అనుమతులు రాలేదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. భారీగా తరలివచ్చిన అభిమానులతో కలిసే అవకాశం లేకపోయినా, తారక్ చిత్ర యూనిట్‌తో సమావేశమయ్యారు. తారక్ యూనిట్ సభ్యులతో విజయాన్ని సంబరంగా పంచుకున్నారు. జక్కన్న సినిమాల్లో నటించిన తర్వాత హీరోలకు ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంట్‌ను తారక్ దేవరతో బ్రేక్ చేసి, పెద్ద విజయాన్ని సాధించారు. దేవర కొరటాల శివ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. థియేటర్లలో 'దావూదీ' సాంగ్ వచ్చిన తర్వాత అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పుడు ఫ్యాన్స్ సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
'వార్ 2' పనుల్లో బిజీగా తారక్
ప్రస్తుతం తారక్ 'వార్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే, నెల్సన్ దర్శకత్వంలో కూడా సినిమా ఉండవచ్చనే చర్చలు ఉన్నాయి. దేవర 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి, ఇది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.