
'Devara' shoot update: గోవాకి వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్..అదిరిన కొత్త లుక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా "దేవర".ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది.
హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ పది రోజుల పాటు జరగనుందని సమాచారం.గోవాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పాట చిత్రీకరించనున్నారట.
జాన్వీ కపూర్-ఎన్టీఆర్ లపై డ్యూయట్ ప్లాన్ చేశారని సమాచారం.
Details
ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్
దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
ఇక గోవాకు వెళుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. టీ షర్ట్, జీన్స్ ధరించి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. తన ఫిట్నెస్ ట్రైనర్ తో పాటు ఎన్టీఆర్ గోవా వెళ్లారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గోవా వెళుతున్నఎన్టీఆర్
NTR @tarak9999 Anna Off To Goa For #Devara Shooting 🔥🔥#ManOfMassesNTR #JrNTR #SaifAliKhan
— Meg 'NTR' (@meghanath9999) March 18, 2024
pic.twitter.com/iKJU7aUOHx