NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NTR: దేవర బ్లాక్ బస్టర్.. స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎన్టీఆర్
    తదుపరి వార్తా కథనం
    NTR: దేవర బ్లాక్ బస్టర్.. స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎన్టీఆర్
    దేవర బ్లాక్ బస్టర్.. స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎన్టీఆర్

    NTR: దేవర బ్లాక్ బస్టర్.. స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎన్టీఆర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెప్టెంబర్ 27న విడుదలైన దేవర సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరి, ఇప్పటికీ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది.

    ఈ సందర్భంగా, దేవర చిత్రాన్ని విజయవంతం చేసినందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక నోట్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

    వివరాలు 

    దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు: ఎన్టీఆర్ 

    "దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు,ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫీ, సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు."

    వివరాలు 

    ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు

    "మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు,థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు.నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు,హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు. ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను."

    వివరాలు 

    గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉంటాను: ఎన్టీఆర్ 

    "మీరు చూపించే ప్రేమ, అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నేను ఎల్లప్పుడూ గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉంటాను. 'దేవర పార్ట్ 1' చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు," అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    జూనియర్ ఎన్టీఆర్

    NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ప్రకటన దేవర
    Devara : దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు  దేవర
    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం! సినిమా
    Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్ దేవర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025