NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎన్టీఆర్ 30 : ఈనెల 24వ తేదీన ముహూర్తం ఫిక్స్?
    తదుపరి వార్తా కథనం
    ఎన్టీఆర్ 30 : ఈనెల 24వ తేదీన ముహూర్తం ఫిక్స్?

    ఎన్టీఆర్ 30 : ఈనెల 24వ తేదీన ముహూర్తం ఫిక్స్?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 15, 2023
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అప్డేట్ల కోసం అంతలా అడగొద్దని ఎన్టీఆర్ చెప్పడంతో అభిమానులు దాదాపు కామ్ అయిపోయారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం, ఆత్రం అలాగే ఉంది, ఇప్పుడు అది తీరిపోయే సమయం వచ్చేసింది. ఎన్టీఆర్ 30 షూటింగ్ పై ఒక పుకారు చక్కర్లు కొడుతోంది.

    ఈ నెల 24వ తేదీన ఎన్టీఆర్30 మొదలవుతుందని, పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఇప్పుడప్పుడే మొదలు పెట్టాలని మేకర్స్ అనుకోలేదట.

    ఆస్కార్ నామినేషన్లో ఉన్న నాటునాటు పాట కోసం, ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి, తిరిగి ఇండియాకు వచ్చాక ఎన్టీఆర్ 30షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారట. అప్పటివరకైతే ఆలస్యం అవుతుందని ఈనెల 24వ తేదీన ఫిక్స్ చేశారట.

    ఎన్టీఆర్ 30

    ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం కంటే ముందుగానే షూటింగ్ మొదలు

    ఫిబ్రవరి 24వ తేదీన షూటింగ్ మొదలెట్టి కొన్ని సీన్లు చిత్రీకరిస్తారట, ఆ తర్వాత ఆస్కార్స్ అవార్డ్స్ ప్రధానోత్సవం పూర్తయిపోయి ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి వచ్చాక రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

    ఈ వార్తను నిజమై, ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ తొందరగా మొదలు కావాలని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు.

    ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికైందని, మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల ఫోటోషూట్ జరుగుతుందని పలు మీడియా సంస్థలు వార్తలు రాసాయి.

    అదీగాక సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తుందని వినికిడి.

    యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఎన్టీఆర్ 30 మూవీ, 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలుగు సినిమా

    బుట్టబొమ్మ సినిమాకు రివ్యూ ఇచ్చిన డీజే టిల్లు ఫేమ్ సిద్ధు సినిమా రిలీజ్
    సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ
    హైదరాబాద్ టాకీస్ నిర్వహిస్తున్న ఇళయరాజా లైవ్ కాన్సెర్ట్ సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? మహేష్ బాబు

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025