ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతటా ప్రశంసలు అందుకున్న ఎన్టీఆర్, తన నెక్స్ట్ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు సమాధానంగా, మార్చ్ లో షూటింగ్ మొదలవుతుందని ఇటీవల చెప్పారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ 30 మూవీ షూటింగ్ మార్చిలో మొదలై, సెప్టెంబరు లేదా అక్టోబరులో ఐపోతుందని టాక్. ఎందుకంటే ఆ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఎన్టీఆర్ 31వ మూవీ షూటింగ్ డిసెంబరులో మొదలు కానుందని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ 31వ మూవీని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ హీరోగా సలార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సలార్ మూవీని సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ 31
2024సంవత్సరంలో షూటింగ్ పూర్తయ్యే అవకాశం
సలార్ పనులు పూర్తి కాగానే ఎన్టీఆర్ 31 సినిమా మీద ఫోకస్ పెట్టనున్నాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ 31మూవీ షూటింగ్ 2023 డిసెంబరులో మొదలై 2024 సంవత్సరంలో పూర్తి చేస్తారట. ఆ తరువాత 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ 31మూవీ మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అటు కేజీఎఫ్ తో బాక్సాఫీసును కొల్లగొట్టిన దర్శకుడు, ఇటు ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన నటుడు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ 31 మూవీ రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది అలాగే ప్రధాన పాత్రల్లో ఎవరు చేస్తున్నారనేది ఇంకా వెల్లడి కాలేదు.