స్టీవెన్ స్పీల్ బర్గ్ నుండి డేనియల్ క్వాన్ వరకూ ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్స్
ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ నామినేషన్లో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి హాలీవుడ్ దర్శకులు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా స్టీవెల్ స్పీల్ బర్గ్, ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడారు. రాజమౌళితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన స్పీల్ బర్గ్, ఆర్ఆర్ఆర్ మూవీ కన్నుల విందుగా ఉందనీ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్ ల నటన బాగుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పీల్ బర్గే కాదు చాలా మంది హాలీవుడ్ దర్శకులు ఆర్ఆర్ఆర్ ని ఆకాశానికేత్తేసారు. జేమ్స్ కామెరూన్: లాస్ ఏంజిల్స్ లో రాజమౌళిని కలిసిన కామెరూన్, ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూసానని, తన భార్య సూజీని చూడమని చెప్పానని కూడా అన్నాడు.
ఆర్ఆర్ఆర్ పై పొగడ్తలు కురిపించిన హాలీవుడ్
రుస్సో బ్రదర్స్: అవెంజర్స్ ఎండ్ గేమ్, ద గ్రే మ్యాన్ చిత్రాల దర్శకులు జో అండ్ ఆంటోనీ, ఆర్ఆర్ఆర్ ఒక గొప్ప సినిమా అనీ, మ్యూజిక్, విజువల్స్, స్టోరీ, బ్రొమాన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. జేమ్స్ గన్: గత ఏడాది జులైలో ఆర్ఆర్ఆర్ మూవీని చూసిన జేమ్స్ గన్, 3గంటల సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని తెలిపారు. ఈయన దర్శకుడే కాదు హాలీవుడ్ నిర్మాణ సంస్థ డీసీ సహవ్యవస్థాపకుడు కూడా. డేనియల్ క్వాన్: 2023లో 11 ఆస్కార్ నామినేషన్లు పొందిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకుడు డేనియల్ క్వాన్ మాట్లాడుతూ, ఇండియన్ యాక్షన్ ఫిలిమ్స్ చూసినప్పుడల్లా నేను వేరే దేశానికి వర్క్ చేస్తున్నానా అన్నట్లుగా ఫీలవుతానని చెప్పుకొచ్చాడు.