NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ ఫలితాల కంటే ముందు మరోసారి థియేటర్లలోకి రానున్న ఆర్ఆర్ఆర్?
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ ఫలితాల కంటే ముందు మరోసారి థియేటర్లలోకి రానున్న ఆర్ఆర్ఆర్?
    ఆస్కార్ రిజల్ట్స్ కంటే ముందుగా మరోసారి థియేటర్లలోకి వస్తున్న ఆర్ఆర్ఆర్

    ఆస్కార్ ఫలితాల కంటే ముందు మరోసారి థియేటర్లలోకి రానున్న ఆర్ఆర్ఆర్?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 02, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 12వ తేదీన హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. ఈసారి ఇండియా నుండి ఆస్కార్ అవార్డులకు మూడు నామినేషన్లు దక్కాయి.

    ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కింది. ఈ విభాగంలో ఆస్కార్ ఖచ్చితంగా అందుకుంటుందని అందరూ నమ్ముతున్నారు.

    ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకోవడంతో, ఆస్కార్ అవార్డ్ పక్కా వస్తుందని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీని మరోమారు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

    ఈ విషయమై చిత్రబృందం కసరత్తులు చేస్తుందని, ఏయే భాషల్లో రిలీజ్ చేయాలి, ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలనే లెక్కలు వేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.

    ఆర్ఆర్ఆర్

    ఆస్కార్ ఫలితాల కంటే ముందుగానే థియేటర్లలో ప్రదర్శన

    ఆర్ఆర్ఆర్ సినిమాను ఎన్ కోర్ ల రూపంలో అమెరికా వాసులు థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేక ప్రదర్శనలు వేయించుకుని మరీ ఐమ్యాక్స్ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను ఆనందిస్తున్నారు.

    అదే మాదిరిగా ఇండియాలోనూ చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కంటే ముందుగానే ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలోకి తీసుకురావలని ప్రయత్నం చేస్తున్నారట.

    అంతర్జాతీయ స్థాయిలో అందరి ప్రశంసలు అందుకుని ఆస్కార్ కు అడుగు దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అందరికీ అందుబాటులో తేవాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నారట.

    ఈ నిర్ణయం నిజమే అయితే ఆర్ఆర్ఆర్ అభిమానులే కాదు భారతీయ సినిమా అభిమానులు అందరూ సంతోషిస్తారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    టాలీవుడ్

    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? త్రివిక్రమ్ శ్రీనివాస్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే చిరంజీవి
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ పవన్ కళ్యాణ్
    వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి సినిమా

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి సినిమా
    ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు సినిమా
    ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025