ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది
ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు కానీ ఆ సినిమా గురించిన చర్చ రోజూ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కాబట్టి ఆ మాత్రం ఆసక్తి ఉండడం సహజమే. ఎన్టీఆర్ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్, మార్చ్ నెలలో షూటింగ్ మొదలు కానుందని చెప్పాడు. దాంతో, అసలు ఎన్టీఆర్ 30వ సినిమా మొదలవుతుందా కాదా అని సందేహపడ్డ అభిమానులకు ఊరట లభించింది. తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమా విలన్ గా ఎవరు చేయనున్నారో తెలిసిపోయింది.
విలన్ గా విజయ్ సేతుపతి విశ్వరూపం?
తమిళ నటుడు విజయ్ సేతుపతి, విలన్ గా ఎన్టీఆర్ ని ఢీ కొట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఎన్టీఆర్ 30వ సినిమా మైలేజ్ మరింత పెరిగినట్లే. ఉప్పెన సినిమాతో తెలుగులోకి వచ్చిన విజయ్ సేతుపతికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ ఉంది. అదీగాక ఎన్టీఆర్ సరసన విలన్ గా విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడు. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కొరటాల శివ, విజయ్ సేతుపతికి కథ వినిపించారని, విజయ్ సేతుపతి పాజిటివ్ గా స్పందించారని వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి. మరో విషయమేంటంటే ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుందని అన్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.