NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ
    తదుపరి వార్తా కథనం
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ
    ఎన్టీఆర్ తో బాలీవుడ్ మూవీ బర్ఫీ తెలుగు రీమేక్ చేస్తానంటున్న తమన్నా

    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 08, 2023
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఈ మధ్య గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సత్యదేవ్ హీరోగా కనిపించిన ఈ సినిమా, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

    ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా చేస్తున్న జైలర్ మూవీలో కనిపిస్తుంది. అలాగే మెహెర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ లో కూడా కనిపించనుంది.

    తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పుకొచ్చింది. తాను నటించిన తెలుగు హీరోలతో ఏదైనా బాలీవుడ్ మూవీ రీమేక్ చేయాలనుకుంటే ఎవరితో నటిస్తారని తమన్నాను అడిగారు.

    ఆ ప్రశ్నకు తమన్నా సమాధానమిస్తూ, జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ మూవీ బర్ఫీ రీమేక్ లో నటించాలనుందని తెలియజేసింది.

    ఎన్టీఆర్

    ఎన్టీఆర్ పై పొగడ్తలు కురిపించిన తమన్నా

    బర్ఫీ లాంటి సినిమాను ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందనీ, ఎప్పుడూ చేసే మాస్ సినిమాలకు భిన్నంగా ఉంటుందనీ, ఎలాంటి జోనర్ లోనైనా సినిమాలు చేసే సత్తా ఎన్టీఆర్ కి ఉందని తమన్నా మాట్లాడింది.

    ఎన్టీఆర్, తమన్నా జంటగా ఊసరవెల్లి సినిమాలో నటించారు. 2010లో రిలీజైన ఊసరవెల్లి సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

    తమన్నా మాటలపై సోషల్ మీడీయాలో స్పందించిన నెటిజన్లు, ఎన్టీఆర్ నిజంగా బర్ఫీ లాంటి సినిమా చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం అందుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం కొరటాల దర్శకత్వం తన 30వ సినిమాను మొదలుపెట్టాడు. ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమాను, 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    తెలుగు సినిమా

    మైఖేల్ ట్రైలర్ టాక్: ఈ భూమ్మీద అమ్మాయే కోసమే బతకాలంటున్న సందీప్ కిషన్ సినిమా
    విషాదం: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ సూసైడ్ సినిమా
    ట్రోలింగ్ వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న రష్మిక మందన్న సినిమా
    మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మూడో హిట్ గా కళ్యాణ్ రామ్ చిత్రం నిలవనుందా? సినిమా రిలీజ్

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025