ఎన్టీఆర్ 30: ఫోటోషూట్ తో తేలిపోనున్న హీరోయిన్ సస్పెన్
ఈ వార్తాకథనం ఏంటి
కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్, కొరటాల శివతో తాను చేస్తున్న సినిమా గురించి అభిమానులతో మాట్లాడుతూ, ప్రతీసారీ మీరు అప్డేట్స్ అడుగుతున్నారని, కానీ మీరు కావాలన్నారని ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగోదని, అప్డేట్ ఇవ్వాలనుకున్నప్పుడు సరైన ప్లానింగ్ ప్రకారం క్వాలిటీగా అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్వాలిటీ అప్డేట్స్ ఇవ్వడానికి పనులు జరుగుతున్నాయని వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటివరకూ చాలామంది హీరోయిన్ లను అనుకున్నారట. కానీ గతంలో వార్తలు వచ్చినట్టుగానే జాన్వీ కపూర్ ని ఫైనల్ చేసారని అనుకుంటున్నారు.
ఎన్టీఆర్
మరికొద్ది రోజుల్లో ఇద్దరితో ఫోటో షూట్
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ సరిగ్గా సరిపోయిందని, జాన్వీ కపూర్ తొలి తెలుగు సినిమా ఎన్టీఆర్ 30యే అవుతుందని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో జాన్వీ కపూర్, ఎన్టీఆర్ ల మధ్య ఫోటో షూట్ జరగనుందని సమాచారం.
ఫోటో షూట్ పూర్తయ్యాక హీరోయిన్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట.
మార్చ్ నెలలో షూటింగ్ మొదలవుతుందని ఎన్టీఆర్ చెప్పాడు కాబట్టి ఈ ఫోటో షూట్ దానికంటే ముందుగా ఉంటుంది. అంటే ఈ నెలాఖరులో ఫోటో షూట్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎన్టీఆర్ 30 సినిమాను యువసుధ ఆర్ట్స్ బ్యానర్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.