LOADING...
JR. NTR : సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు

JR. NTR : సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమురి ఫ్యాన్స్‌కి, టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరినైనా, ముఖ్యంగా బాలయ్య, నారా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు గురించి ట్వీట్ చేస్తే అది ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తుంది. బాబాయ్-అబ్బాయ్‌లను ఒకే వేదికపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో సినిమా ఫంక్షన్లలో వీరిద్దరూ కలిసిన సందర్భాలు అభిమానుల్లో ఉత్సాహం రేపాయి. అయితే ప్రస్తుతం వారు ఎవరి దారిన వారు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కారణాలు వ్యక్తిగతమే. అయినప్పటికీ, బాబాయ్ పుట్టినరోజున అబ్బాయ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.

Details

ఏపీలో టికెట్‌ రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

అలాగే నారా లోకేష్ లేదా చంద్రబాబు ఎన్టీఆర్‌ గురించి ట్వీట్ చేసినా, లేదా ఎన్టీఆర్‌ నారావారిని ఉద్దేశించి ట్వీట్ చేసినా, ఆ క్షణం పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఈ రోజు రాత్రి ప్రీమియర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు ఏపీలో టికెట్‌ రేట్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి కృతజ్ఞతగా ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కి ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.