LOADING...
Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే!
జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే!

Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించగా, చివరిదశలో మళ్లీ విషమించడంతో ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపినాథ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు పలు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించిన గోపినాథ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Details

1995లో పాతబస్తీ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన గోపినాథ్

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయనకు సినీ రంగంతోనూ ఎంతో మమేకత ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన నిర్మాతగానూ చురుగ్గా వ్యవహరించారు. 1995లో శ్రీ సాయినాధ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్, శ్రీకాంత్, నాగబాబు కీలక పాత్రల్లో నటించిన *పాతబస్తీ* చిత్రాన్ని నిర్మించారు. అనంతరం 2000లో RK ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజశేఖర్, కృష్ణలతో కలిసి 'రవన్న' సినిమాను నిర్మించారు. 2004లో తారకరత్న ప్రధాన పాత్రలో 'భద్రాద్రి రాముడు'ను దివ్య అక్షర నాగ మూవీ బ్యానర్‌పై నిర్మించగా, 2009లో రాజశేఖర్‌తో కలిసి 'నా స్టైలే వేరు' అనే చిత్రాన్ని దిశిరా ప్రొడక్షన్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

Details

సినీ రంగల్లో తనదైన ముద్ర వేసుకున్న గోపినాథ్

ఇవన్నీ ఆయన సినీ అభిరుచికి నిదర్శనంగా నిలిచాయి. అయితే ఈ నాలుగు సినిమాలు కూడా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. కానీ రాజకీయాల్లోనే కాదు.. సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించిన మాగంటి గోపినాథ్ గుండె ఆగిపోవడంతో అనేక మంది విషాదంలో మునిగిపోయారు.