తదుపరి వార్తా కథనం
Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 30, 2024
12:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.
చిక్కడపల్లి పోలీసులు బెయిల్ మంజూరు చేయకూడదని కౌంటర్ దాఖలు చేయగా, అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు.
కోర్టు ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాక, తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది.
Details
జనవరి 3కు వాయిదా
ఇప్పటికే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా, అది 27వ తేదీన ముగిసింది. ఆ రోజు ఆయన వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు.
అప్పుడు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.