
ఎన్టీఆర్ నటించిన ఆది రీ రిలీజ్: జూనియర్ బర్త్ డే నుండి సీనియర్ బర్త్ డే వరకు నడవనున్న షోస్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రీ రిలీజ్ లు జరుగుతున్నాయి. హీరోల బర్త్ డే లను పురస్కరించుకుని హిట్ సినిమాలను థియేటర్లలోకి మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆరెంజ్, అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా దేశ ముదురు సినిమాలు థియేటర్లలో సందడి చేసాయి.
అంతకుముందు పవన్ కళ్యాణ్ చిత్రాలు జల్సా, ఖుషి వంటివి తెలుగు బాక్సాఫీసు వద్ద మళ్ళీ కలెక్షన్లు అందుకున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బర్త్ డే కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
మే 20వ తేదీన పుట్టినరోజు జరుపుకోబోతున్న ఎన్టీఆర్, తన అభిమానుల కోసం సింహాద్రి, ఆది సినిమాలను థియేటర్లోకి తెస్తున్నాడు.
NTR
జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే నుండి సీనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వరకు
ఇక్కడ ఆది సినిమా రీ రిలీజ్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20వ తేదీన థియేటర్లలోకి వచ్చే ఆది సినిమా, సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీ వరకు థియేటర్లలో సందడి చేయనుంది.
అంటే దాదాపు 9రోజుల పాటు థియేటర్లలో సందడి చేయనుంది ఆది సినిమా. ఈ మేరకు అధికారికంగా తెలియజేసారు కూడా. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పాలి.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ను పెద్ద తెర మీద చూడడానికి 2సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తున్న తరుణంలో, అంతకన్నా ముందుగా, ఎన్టీఆర్ ని వెండితెర మీద చూసుకోవాల్సిన అవకాశం వచ్చింది.
ఆది సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు.