Page Loader
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ తేదీ ఫిక్స్? 
2025 జనవరిలో వార్ 2 రిలీజ్ అంటూ వార్తలు

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ తేదీ ఫిక్స్? 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 01, 2023
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటించనున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న వార్ 2 సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీపై ఒకానొక వార్త ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వార్ 2 సినిమా రిలీజ్ 2025 జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యాక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట.

Details

వార్ 2 సినిమాలో కియారా అద్వానీ? 

వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాల నుండి సమాచారం వస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుందని వినిపిస్తోంది. వార్ సినిమా మొదటి పార్ట్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఈ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వార్ 2 సినిమా దర్శకుడు మారిపోయాడు. వార్ 2 సినిమాను వార్ 1 కంటే మించిన బడ్జెట్ తో తెరకెక్కించాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రయత్నాలు చేస్తోంది. వార్ 2 పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని సమాచారం.