LOADING...
Junior NTR: న్యూఇయర్ వెకేషన్‌కు తారక్ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
న్యూఇయర్ వెకేషన్‌కు తారక్ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?

Junior NTR: న్యూఇయర్ వెకేషన్‌కు తారక్ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2023
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం 'దేవర' సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా నుండి విరామం దొరకడంతో 2024 వేడుకులను ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలతో కలిసి జపాన్ కు వెళ్లాడు. ఎయిర్ పోర్టులో ఫ్యామిలీ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ షూటింగ్ విరామాల్లో ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.

Details

ఏప్రిల్ 5న దేవర రిలీజ్

ఇదిలా ఉండగా.. దేవర మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. దేవర పార్ట్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.