Vikrant Massey: విరామం మాత్రమే.. రిటైర్మెంట్ కాదు : విక్రాంత్ మాస్సే
ఈ వార్తాకథనం ఏంటి
'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విక్రాంత్ మాస్సే గతంలో నటనకు కొన్ని నెలల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై అప్పట్లో అనేక వార్తలు, ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని విక్రాంత్ మాస్సే తాజాగా స్పష్టం చేశారు. 'నేను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా తక్కువ పదాల్లో చెప్పడం వల్ల అది తప్పుగా అర్థమైంది. నేను విరామం తీసుకోవాలని మాత్రమే భావించాను. శాశ్వతంగా నటనకు దూరమవుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఆ సమయంలో నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. అందుకే కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. కానీ అందరూ నేను ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తప్పుకుంటానని అనుకున్నారు.
Details
రోజుకు 16 గంటలు పనిచేయడం ఇబ్బందిగా అనిపించింది
రోజుకు 14 నుంచి 16 గంటలు పని చేయడం తనకు ఇబ్బంది అనిపించిందని విక్రాంత్ మాస్సే చెప్పారు. వరుస ప్రాజెక్ట్‌లతో శారీరకంగా, మానసికంగా అలసిపోయానని, అందుకే విరామం ప్రకటించానని వివరించారు. ఆ సమయంలో నేను చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. సినిమాలు హిట్ అవుతున్నప్పటికీ ఏడాదికి నాలుగు చిత్రాలు చేయడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. సీరియల్స్‌తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన విక్రాంత్ మాస్సే, 2024 చివర్లో రిటైర్మెంట్‌పై పోస్ట్ పెట్టారు. కుటుంబసభ్యులకు పూర్తిస్థాయి సమయం కేటాయించాల్సిన సమయం వచ్చిందని, ఇకపై కొత్త సినిమాలను అంగీకరించడం లేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ ప్రకటన చేసిన ఏడునెలల తర్వాత ఆయన మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌లను అంగీకరించారు.