Page Loader
Suriya: జ్యోతిక తన కోసం ఎన్నో త్యాగాలను చేసింది.. కీలక వ్యాఖ్యలు చేసిన సూర్య
జ్యోతిక తన కోసం ఎన్నో త్యాగాలను చేసింది.. కీలక వ్యాఖ్యలు చేసిన సూర్య

Suriya: జ్యోతిక తన కోసం ఎన్నో త్యాగాలను చేసింది.. కీలక వ్యాఖ్యలు చేసిన సూర్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 29, 2024
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ సూర్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ కుటుంబం ముంబయికి తరలించడంపై మాట్లాడారు. అయితే తన భార్య జ్యోతిక అనేక త్యాగాలు చేసినందుకు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జ్యోతిక 18 సంవత్సరాల వయస్సులో చెన్నైకి వచ్చిందని, తమ పెళ్లి తర్వాత అక్కడే ఉన్నామన్నారు. ఆమె తన కుటుంబం కోసం అనేక కష్టాలు పడిందన్నారు. ముంబయిలోని తన స్నేహితులను, కెరీర్‌ను కూడా వదులుకుందన్నారు. కోవిడ్‌ తర్వాత మార్పు అవసరం అనిపించి, ముంబయి చేరుకున్నామన్నారు. ప్రస్తుతం ఆమెకి ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయని, విభిన్న ప్రాజెక్ట్‌లలో ముందుకెళ్తుతోందని సూర్య ప్రశంసించారు. తాను గొప్ప దర్శకులతో పనిచేయాలని అనుకుంటున్నానని, కానీ ఆమె మాత్రం ఎప్పుడూ కొత్త దర్శకులు, నిర్మాతలతో పని చేయాలని కోరుకుంటుందన్నారు.

Details

నవంబర్ 14న కంగువా రిలీజ్

ఇటీవల ఆమె నటించిన 'శ్రీకాంత్‌', 'కాదల్‌ - ది కోర్‌' చిత్రాలు ఎంత వైవిధ్యమైనవో చెప్పనక్కర్లేదన్నారు. మహిళలకు పని విషయంలో స్వాతంత్య్రం ఉండాలని పేర్కొన్నారు. తాను నెలలో 10 రోజులు కుటుంబానికి కేటాయిస్తానమని సూర్య చెప్పుకొచ్చారు. ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌లో ఒక జోడి అయిన సూర్య, జ్యోతిక తమిళంలో 'పూవెల్లం కేట్టుప్పార్‌' వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ కొత్త ప్రాజెక్టు రాబోతుందని సమాచారం. 18 సంవత్సరాల తరువాత మరోసారి వీరిద్దరిని స్క్రీన్‌పై చూడగలమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య 'కంగువా' చిత్రంతో బిజీగా ఉన్నారు, శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.