Kaagitham Padavalu: 'కాగితం పడవలు' గ్లింప్స్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సున్నితమైన ప్రేమకథా చిత్రం 'కాగితం పడవలు'. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజులు, గాయిత్రమ్మ అంజనప్ప ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. "చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి... నిన్ను ఎక్కడ వదిలేశానో, అక్కడే నిలబడి ఉన్నాను రామ్" అని వినిపించే భావోద్వేగభరిత డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి తీరప్రాంతంలో జంట కలుసుకోవడం, అందమైన దృశ్యాలు, హృదయాన్ని తాకే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అదనపు అందాన్ని తెచ్చాయి.
వివరాలు
రాబోయే ప్రచార కంటెంట్‌పై ప్రేక్షకుల ఆసక్తి
గ్లింప్స్‌ను పరిశీలిస్తే, దర్శకుడు ఎంజీఆర్ తుకారాం ఈ సినిమాను గాఢమైన భావోద్వేగాలతో, హృదయాన్ని హత్తుకునే కథనంతో, ఆహ్లాదకరమైన విజువల్స్‌తో మలిచినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, రాబోయే ప్రచార కంటెంట్‌పై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఐఎస్ నౌఫల్ రాజా అందిస్తుండగా, రుద్రసాయి,జానా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎడిటింగ్‌ను జెస్విన్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎం. హిమ బిందు నిర్వహిస్తున్నారు. ఇక, కాస్ట్యూమ్స్‌ను కిరణ్ సమకూర్చగా, సాహిత్యాన్ని రెహమాన్ రాశారు. పీఆర్‌ఓగా తేజస్వి సజ్జా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రేమకథా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.