Mammotty: స్వలింగ సంపర్క పాత్రలో మమ్ముట్టి.. సినిమాను ఆ దేశాల్లో అందుకే బ్యాన్ చేశారట
మాలీవుడ్ మెగాస్టార్, నటుడు మమ్ముట్టి నటించిన ఓ చిత్రం కువైట్, ఖతర్ దేశాల్లో నిలిచిపోయింది. ఈ సినిమాలోని అడల్ట్ కంటెంట్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆ దేశాల్లో బ్యాన్ అయ్యింది. జీయో బేబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్న ఈ సినిమాను తాజాగా కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. మమ్ముట్టి- జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కాథల్-ది కోర్' (Kaathal - The Core) చిత్రంపై రెండు గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయి. దీంతో దక్షిణాదిలో చర్చనీయాంశమైంది.
సెక్సువల్ గే పాత్ర కారణంగానే సినిమా బ్యాన్
ఈ సినిమాలో ముమ్మట్టి హోమో సెక్సువల్ గే పాత్రలో కనిపించారని, ఈ కారణంగానే ఆ దేశాల సెన్సార్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. జార్జి దేవసి పాత్రలో నటించిన మమ్ముట్టి, కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారిగా పనిచేస్తూంటాడు. అయితే ఓ సందర్భంలో పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే దేవసి, సెక్సువల్'గా గే కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే అతని భార్య ఓమన (జ్యోతిక) విడాకులకు దరఖాస్తు చేయడం, నుంచి కథ ఉత్కంఠగా మారుతుంది. ఈ చిత్రాన్ని మమ్ముట్టి సహా వేఫారెర్ ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో నిర్మించారు. ఇటీవలే మమ్ముట్టి నటించిన "కన్నూర్ స్క్వాడ్" థియేటర్లలోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఓటిటిలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.