హ్యాపీ బర్త్ డే కాజల్: తెరమీద ఇంట్రెస్టింగ్ పాత్రల్లో కాజల్ కనిపించిన సినిమాలు
స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ ని తెచ్చుకోవడం అంత సులభం కాదు. తెచ్చుకున్నాక దాన్ని నిలబెటుకోవడమూ కష్టమే. ఇలాంటి ఫీట్ సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందులో కాజల్ అగర్వాల్ ఒకరు. 2007లో రిలీజైన లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత స్తార్ హీరోయిన్ గా మారి ఇప్పటికీ స్టార్ గానే కొనసాగుతోంది. ఈరోజు కాజల్ పుట్టినరోజు, ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ పాత్రల్లో కాజల్ కనిపించిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. చందమామ: ఈ సినిమాతోనే కాజల్ కి మొదటి హిట్ లభించింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ గ్లామర్, అందం అందరినీ ఆకట్టుకుంటాయి.
మగధీర సినిమాతో స్టార్ స్టేటస్
మగధీర: రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యువరాణి మిత్రవిందగా, సాధారణ యువతి ఇందు అనే అమ్మాయి పాత్రలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించి అందరినీ ఆకర్షించింది. ఈ సినిమాతోనే కాజల్ కు స్టార్ స్టేటస్ లభించింది. యువరాణిగా ఆమె అందం, ఠీవి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నేనే రాజు నేనే మంత్రి: రానా దగ్గుబాటి హీరోగా కనిపించిన ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కించారు. అంతకుముందు తాను చేసిన అన్ని పాత్రల్లోకెల్లా ఈ సినిమాలో కాజల్ చేసిన పాత్ర విభిన్నంగా ఉంటుంది. అ!: కాజల్ చేసిన ప్రయోగాత్మక చిత్రమిది . మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడే అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదనేదే కథ.
పొగరుబట్టిన సీత పాత్రలో కాజల్
సీత: లేడి ఓరియంటెడ్ సినిమా అయిన సీత చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కించారు. ఈ సినిమాలో పొగరుబట్టిన సీత పాత్రలో కాజల్ అగర్వాల్ నటన అందరికీ నచ్చుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కనిపించిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద సరైన ఫలితాన్ని పొందలేదు. కానీ కాజల్ కెరీర్లో గుర్తుండిపోయే పాత్రగా సీత క్యారెక్టర్ మిగిలిపోయింది. అదలా ఉంచితే, ప్రస్తుతం ఒక బిడ్డకు జన్మనిచ్చిన కాజల్, మళ్ళీ సినిమాల వైపు మళ్ళింది. బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి, కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 చిత్రంలో ఆమె నటిస్తున్నారు. తాజాగా కాజల్ ప్రధాన పాత్రలో సత్యభామ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాను అఖిల్ డేగల డైరెక్ట్ చేస్తున్నారు.