మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు
అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో మీడియాతో కల్కి టీమ్ ముచ్చటించింది. ఈ సంభాషణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. కల్కి సినిమాలో నటిస్తున్న ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ల గురించి మాట్లాడిన కమల్ హాసన్, వారిపై పొగడ్తలు కురిపించారు. దాంతో మధ్యలో అమితాబ్ బచ్చన్ అందుకుని, నువ్వు మా అందరికంతే గొప్పవాడివి కమల్, అంత సింపుల్ గా ఉండవద్దని అమితాబ్ అన్నారు.
ఈవెంట్ కు హాజరు కాని దీపికా పదుకొణె
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సంభాషణ వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అదలా ఉంచితే కల్కి 2898 AD గ్లింప్స్ విడుదలకు దీపికా పదుకొణె హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి దీపికా హాజరు అవుతుందని చిత్రబృందం వెల్లడి చేసింది. అయినా కుడా హాజరు కాలేకపోవడానికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు. ఇకపోతే కల్కి 2898 AD గ్లింప్స్ మాత్రం అందరినీ అలరిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలను గ్లింప్స్ వీడియో మరింత పెంచేసింది. సైన్స్ ఫిక్షన్, పురాణాలను మిక్స్ చేసి సరికొత్త కథను కల్కి 2898 ఏడీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు.