Kalki 2898 AD:ప్రాంతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డు.. 900 కోట్ల క్లబ్ కు చేరువలో రాంపేజ్
వైజయంతీ మూవీస్ బ్యానర్ 50సంవత్సరాలు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాను అశ్వినీదత్,ప్రియాంక దత్,స్వప్నదత్ నిర్మించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ సినిమా 12వరోజు కలెక్షన్ వివరాలు ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ప్రభాస్,అమితాబ్,కమల్,దీపిక నటించిన కల్కి చిత్రం సుమారుగా 620కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 372కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ రిపోర్ట్. అయితే ఈసినిమా సుమారుగా 375 షేర్‌తో బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన పరిస్థితిలో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.
1000 కోట్ల రూపాయల గ్రాస్ దిశగా కల్కి 2898 ఏడీ చిత్రం
కల్కి 2898 AD చిత్రం గత 11 రోజుల్లో ఇండియాలో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ఆంధ్రా,నైజాంలో 250 కోట్లు,కర్ణాటకలో 57 కోట్లు,తమిళనాడులో 38 కోట్లు,కేరళలో 24 కోట్లు, హిందీలో 250 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 607కోట్లు రూపాయలు వసూలు చేసింది.కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 900 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తుంది.రెండోవారం ముగిసే సమయానికి 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే ఛాన్స్ పక్కాగా కనిపిస్తున్నది. ఈ సినిమా చాలా చోట్ల బాహుబలి 2సినిమా రికార్డులకు చేరువగా రాగా..మరికొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేస్తున్నది.