తదుపరి వార్తా కథనం

Kalki 2898 AD: కల్కి 2898 AD 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
వ్రాసిన వారు
Stalin
Jun 30, 2024
04:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD జూన్ 27, 2024న విడుదలైనప్పటి నుండి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి అడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ చిత్రం ఇప్పటికే 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 415 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాటికి 500 కోట్లు దాటుతుందని అంచనా.
వైజయంతీ మూవీస్ ఈ చిత్రంను రూ. 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. ఇది దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా.
ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
మీరు పూర్తి చేశారు