Page Loader
Kalpika : సినీ నటి కల్పిక‌ గణేష్ పై మరో కేసు నమోదు 
సినీ నటి కల్పిక‌ గణేష్ పై మరో కేసు నమోదు

Kalpika : సినీ నటి కల్పిక‌ గణేష్ పై మరో కేసు నమోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సినీ నటి కల్పిక గణేష్ నిత్యం ఏదోఒక వివాదంలో చిక్కి చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఆమెపై మరో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అసభ్య పదజాలాన్ని వాడుతూ తాను దూషణలకు గురయ్యానని బాధితురాలైన కీర్తన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్పిక, ఆన్‌లైన్‌లో తల్లడిల్లేలా మాట్లాడడంతో పాటు తనను మానసికంగా వేధించిందని కూడా ఆమె తెలిపింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లలోనే కాకుండా,డైరెక్ట్ మెసేజ్‌లలోనూ కల్పిక వల్గర్‌గా ప్రవర్తించిందని బాధితురాలు ఆరోపించింది. దీనికి సంబంధించి ఆమె స్క్రీన్‌షాట్‌లు,మెసేజ్‌లను ఆధారాలుగా చూపిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.

వివరాలు 

కల్పికపై తీవ్ర స్థాయిలో విమర్శలు

ఆమెపై ఐటీ చట్టం 67 (ఐటీఏ 2000-2008), సెక్షన్లు 79, 356 బీఎన్‌ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో కల్పికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఇక కల్పిక బయటికి రావడం కష్టమే " అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.