
Devara 2: 'దేవర 2'పై కల్యాణ్ రామ్ కీలక అప్‌డేట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ గతేడాది ప్రేక్షకులను 'దేవర' సినిమా ద్వారా ఎంతో ఆకట్టుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.
బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తర్వాత అభిమానుల్లో సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
అయితే ఇప్పటివరకు 'దేవర 2' గురించి చిత్ర బృందం నుంచి స్పష్టమైన సమాచారం రాలేదు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఈ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు కానీ, దాని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేకపోయారు.
వివరాలు
ఎన్టీఆర్ ప్రాజెక్టులపై స్పష్టత ఇచ్చిన కల్యాణ్ రామ్
ఇదిలా ఉండగా,ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
'వార్ 2', 'NTRNeel', 'దేవర 2' చిత్రాల పాటు, తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టులలో 'వార్ 2' ముందుగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఆ తర్వాత ఏ సినిమా మొదలవుతుందనేది అభిమానుల్లో సందిగ్ధతకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో,నటుడు కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ప్రాజెక్టులపై స్పష్టత ఇచ్చారు.
నెల్సన్ సినిమా కంటే ముందుగా 'దేవర 2' షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే 'దేవర 2' సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పారు.
వివరాలు
వార్ 2'షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు
ఈక్రమంలో 2026లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
అంతేకాదు,'దేవర 2' కోసం ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలిసింది.
ఈచిత్రం 2026లో పూర్తి కావచ్చు,2027లో విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
దాంతో నెల్సన్ ప్రాజెక్ట్ ఆ తరువాతే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా,'వార్ 2'షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన సెట్స్‌పై అడుగుపెట్టారు.
ఈచిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు.
మేకర్స్ ఈ సినిమాను 2026 జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
కల్యాణ్ రామ్ ఇచ్చిన 'దేవర 2'కి సంబంధించిన తాజా సమాచారం అభిమానుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది.
ఈసీక్వెల్ కోసం వారు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.