
రిలీజ్ కు రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా, షూటింగ్ పై తాజా అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
అమిగోస్ చిత్రంతో ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు కళ్యాణ్ రామ్. బింబిసార విజయవంతం కావడంతో అమిగోస్ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ బాక్సాఫీసు వద్ద ఆ ఆశలన్నీ నిరాశగా మారిపోయాయి.
థియేటర్ల వద్ద కనీస కలెక్షన్లను కూడా సాధించలేకపోయింది అమిగోస్ చిత్రం. అయితే ఇప్పుడు అమిగోస్ మిగిల్చిన నిరాశను భర్తీ చేయడానికి డెవిల్ సినిమాతో వస్తున్నాడు కళ్యాణ్ రామ్.
స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న 1945ప్రాంతంలో జరిగిన కథను వెండితెర మీద చూపించబోతున్నారట.
బ్రిటీష్ కాలంలో భారతదేశంలో జరిగిన సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని అధికారికంగా అప్డేట్ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగు పెట్టారట.
Details
ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్
అవసరాల శ్రీనివాస నటించిన బాబు బాగా బిజీ చిత్ర దర్శకుడు నవీన్ మేడారం, డెవిల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
డెవిల్ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
స్వాత్రంత్ర్యానికి పూర్వపు కథను తెరమీద చూడాలని జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, కథనం, మాటలను శ్రీకాంత్ విస్సా అందించారు.