విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్
ఈ వార్తాకథనం ఏంటి
సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష సినిమా ట్రైలర్ ఇంతకుముందే విడుదలైంది. తమ ఊరికి ఎవరూ రావొద్దంటూ బోర్డ్ తగిలించిన ఊరికి సాయి ధరమ్ వెళ్ళినట్లుగా చూపించారు.
ఆ ఊరిలో సంయుక్తా మీనన్ పాత్రను కలుసుకుని ఆమెతో ప్రేమాయణం నడిపినట్లుగా చూపించారు. ఆ తర్వాత ఆ ఊరిలో ఒక్కొక్కరుగా చనిపోతుంటారని, దానికి కారణం ఏంటో కనుక్కోవాలని సాయి ధరమ్ తేజ్ అనుకున్నట్లు ట్రైలర్ లో కనిపించింది.
ఆ తర్వాతే అసలు సిసలు సినిమా ఉంటుందని ట్రైలర్ లో చెప్పేసారు. 2నిమిషాల ట్రైలర్ లో కథేంటనేది బయటపడక పోయినా, ఏదో రహస్యాన్ని కనుక్కోవడం కోసం సాయి ధరమ్ తేజ్ పాత్ర ప్రయత్నిస్తుందని అర్థమైంది.
Details
ఆసక్తికరంగా కనిపించిన సాయి తేజ్, సంయుక్తా కెమిస్ట్రీ
ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ బాగానే కనిపించాయి. అలాగే థ్రిల్లర్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా పాత్రల మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నట్లుగా ట్రైలర్ మొదట్లో చూపించారు.
సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే తో వస్తున్న విరూపాక్ష చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ అవుతుంది.
రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సాయి చంద్, సునీల్, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మించారు.
కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజవుతుంది.