LOADING...
Dileep Raj: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

Dileep Raj: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ సినిమా పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సమయంలో దిలీప్ రాజ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

వివరాలు

సానుభూతి తెలిపిన సినీ ప్రముఖులు..

2007లో విడుదలైన మిలానా సినిమాతో దిలీప్ రాజ్‌కు మంచి గుర్తింపు లభించింది. ఇందులో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించారు. అనంతరం యూ -టర్న్ సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ దిలీప్ రాజ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనేక టెలివిజన్ సీరియళ్లను నిర్మించారు. అలాగే, కన్నడ టీవీ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా సేవలందించారు. దిలీప్ రాజ్ అకాల మరణంతో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.

Advertisement