పవన్ కళ్యాణ్ మేనియా అంటే ఇదే.. పవర్ స్టార్‌పై కన్నడ హీరో కామెంట్స్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉందని ఇదివరకు చాలామంది హీరోలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడ హీరో చెబుతున్న మాటలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి.. సప్త సాగరాలు దాటి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కన్నడలో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ చిత్రం ఈరోజు తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో హైదరాబాద్ విచ్చేసిన రక్షిత్ శెట్టిని, మీరు తెలుగులో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారని ఒక మీడియా పర్సన్ అడిగాడు. దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ తో నటించాలనుందని, ఆయన స్టైల్ ని ఎవరూ అనుకరించలేరని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.