Page Loader
Sandalwood : కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. ఇదే జాబితా 
కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల బ్రహ్మరథం

Sandalwood : కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. ఇదే జాబితా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 15, 2023
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

శాండిల్‌ వుడ్‌ అనగానే తెలుగువారికి కన్నడతో ఉన్న అనుబంధమే గుర్తొస్తుంది. 1954లో డైరెక్ట్‌ తెలుగు సినిమా 'కాళహస్తి మహత్యం'లో కన్నప్పగా కంఠీరవ రాజ్‌కుమార్‌ నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్‌లో కన్నడ నటులకూ కటౌట్లు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇలా తెలుగు థియేటర్లో కస్తూరి పరిమళాలు(శాండిల్‌వుడ్‌) మైమరపిస్తున్నాయి. ప్రస్తుతం కన్నడ హీరోలకు, అక్కడి సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'కాంతార' విడుదలైన రెండో రోజు నుంచి 'కాంతార' హవా నడిచింది. కథ, కథనం ప్రాంతాలకతీతమైనా... తెలుగువారూ ఈ చిత్రాన్ని తమదే అన్నట్టుగా సొంతం చేసుకున్నారు. భూతకోల ఆచారాన్ని చూపించిన తీరు, పంజుర్లిగా రిషభ్‌ నటన కనక వర్షాన్ని కురిపించింది. దీంతో తెలుగు, కన్నడ డబ్బింగ్‌ లైన్ ను ఈ చిత్రం చెరిపేసింది.

details

తెలుగులోనూ సుదీప్ 'విక్రాంత్' సూపర్ హిట్

విక్రాంత్ జోరు స్టార్ హీరో కిచ్చ సుదీప్‌ తెలుగువారికి కొత్తేం కాదు.ఈగ సినిమాతో విలనిజంతో టాలీవుడ్ లోనూ స్టార్‌ అయ్యాడు. బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లోనూ సుదీప్‌ కీలక పాత్రల్లో నటించాడు. గతేడాది విడుదలైన విక్రాంత్‌ రోణా బాక్సాఫీస్‌ బద్దలు కొట్టింది. బాయ్స్ హాస్టల్ ఈ ఏడు కన్నడలో 'హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే' హిట్ టాక్ తెచ్చుకుంది. జాతిరత్నాలు' మాదిరే సిల్లీ కామెడీతో తెరపైకి తెచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల మదిదోచింది. దీన్నే తెలుగులో 'బాయ్స్‌ హాస్టల్‌' పేరుతో డబ్ చేయడంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈమధ్య కాలంలో దండుపాళ్యంతో మొదలైన కన్నడ హవా '777 చార్లీ', 'కబ్జా' చిత్రాల వరకు విశేషంగా ఆదరణ పొందింది.

details

ఇండియన్ స్క్రీన్స్ ను షేక్ చేసిన కేజీఎఫ్

బ్లాక్ బస్టర్ 'కేజీఎఫ్‌' డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌, యశ్‌ నటనా మాయాజాలం వెరసి 'కేజీఎఫ్‌ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా టేకింగ్‌లోనూ కొత్తదనం చూపించడంతో ఈ సినిమాకు భారీ తారాగణం అదనపు బలంగా నిలిచింది. కోలార్‌ బంగారు గనుల నేపథ్యం కలిసొచ్చింది. ఇందులో హీరోయిజం, విలనిజం రెండూ పండాయి.దీంతో చిన్న పిల్లల దగ్గర్నుంచి యువత వరకు ఉత్కంఠత రేకెత్తించింది. 'కేజీఎఫ్‌' రెండు పార్టులు ఇండియన్ బిగ్ స్క్రీన్ పై భారీ యాక్షన్‌ చిత్రాలుగా ఘనతకెక్కాయి.ఇదే సమయంలో తెలుగు డబ్బింగ్‌ సహా తమిళం, హిందీ భాషల్లోనూ కేజీఎఫ్ రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో యశ్‌కు యమ క్రేజ్‌ వచ్చింది. ఇలా ప్రశాంత్‌ నీల్‌కు టాలీవుడ్ హీరోలు ఎర్ర తివాచీ పరిచారు.

details

టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సప్త సాగరాలు

ఏడు సంద్రాలు శాండిల్ వుడ్ లో ఈమధ్య రిలీజైన 'సప్తసాగర దాచె ఎల్లో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. తెలుగులో 'సప్త సాగరాలు దాటి- సైడ్‌ ఏ' పేరుతో డబ్బింగ్‌ సినిమా విడుదలైంది. అయితే కన్నడలో సూపర్ హిట్ తెచ్చుకున్న సినిమాను అలాగే కేవలం డబ్ చేసి తెలుగులోనూ విడుదల చేయడంతో తెలుగు ప్రేక్షకులు బాగా రీసివ్ చేసుకున్నారు. దీంతో హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలి భాగం మంచి హిట్ అందుకున్న ఈ మూవీ, రెండో భాగం తెరకెక్కుతోంది. సైడ్‌ ఏ చూసిన తెలుగు ప్రేక్షకులు, ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం టాలీవుడ్ లో కన్నడ సినిమాల క్రేజ్ ను తెలియజేస్తోంది.