Page Loader
Kannappa: మోహన్ లాల్ పుట్టినరోజు స్పెషల్.. 'కన్నప్ప' నుంచి స్పెషల్ గ్లింప్స్.. 

Kannappa: మోహన్ లాల్ పుట్టినరోజు స్పెషల్.. 'కన్నప్ప' నుంచి స్పెషల్ గ్లింప్స్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన నటించిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి ఘన విజయం సాధిస్తూ, దాదాపు ప్రతి చిత్రం కూడా రూ. 200 కోట్లు పైగా వసూళ్లు నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మోహన్ లాల్, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'కన్నప్ప' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదల అవుతున్న ప్రతి ఒక్క అప్డేట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్‌గా మారుతోంది. క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్‌లు, పాటలు ఇలా ప్రతి అంశం కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

వివరాలు 

కిరాత పాత్రలో మోహన్ లాల్ 

ఇక జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ రోజు మే 21, మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో మోహన్ లాల్ స్క్రీన్‌పై కనిపించిన విధానం, ఆయన ప్రెజెన్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా, వీడియో మొత్తం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఆయన కిరాత పాత్రలో ఎలా నటించబోతున్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఆయన నటన, స్క్రీన్‌లో ఉన్న పవర్‌ఫుల్ యాక్టింగ్‌ ప్రజలను అలరించకమానదని చెప్పవచ్చు.

వివరాలు 

 అమెరికాలో ప్రమోషన్ టూర్‌ను పూర్తి 

ఈ సినిమాలో మోహన్ లాల్, దైవిక శక్తులతో ముడిపడిన 'కిరాత' అనే పాత్రను పోషిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో మంచు విష్ణు, కన్నప్ప టీమ్ చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఇప్పటికే అమెరికాలో నిర్వహించిన ప్రమోషన్ టూర్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సమస్త చేసిన ట్వీట్