Kanappa: కేన్స్ కార్పెట్ పై తొలి సారిగా మంచు విష్ణు.. కన్నప్ప టీజర్ కు గ్రాండ్ రెస్పాన్స్
కేన్స్ కార్పెట్ పై నడిచి వెళ్లడం తనకు సరికొత్త అనుభూతి కలిగించిందని హీరో మంచు విష్ణు తెలిపారు. ఇండియా నుంచి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, శోభిత ధూళిపాళ, ఊర్వశి రౌతెలా తదితరులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా కన్నప్ప చిత్ర బృందం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. ఓ తెలుగు నటుడికి దక్కిన అరుదైన గౌరవంగా ఆయన అభివర్ణించారు. మరో వైపు పలు భాషల్లో డబ్ చేసిన ఈ మూవీ అంతర్జాతీయంగా విడుదల కానుంది.
ఇండియాలో ఎప్పుడంటే..
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్టార్ కాస్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్‌కు మంచి స్పందన వచ్చినట్లు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.కేన్స్‌లో కన్నప్ప టీజర్‌ను ప్రదర్శించాము, మంచి స్పందన వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు, స్థానిక భారతీయులతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. ఇలాంటి రెస్పాన్స్ చూసిన తరువాత ఎంతో సంతోషంగా ఉన్నాను. భారతదేశంలోని ప్రేక్షకుల కోసం టీజర్‌ను జూన్ 13న విడుదల చేయనున్నాం.' అని మంచు విష్ణు తెలిపారు.
మే 30న తెలుగు వెర్షన్ టీజర్
ఇక అంతకముందే.. కన్నప్ప ప్రయాణంలో నిరంతరం నాకు మద్దతుగా నిలుస్తూ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో సందేశాలు పంపుతూ నన్ను ఊత్సాహపరిచిన ప్రేక్షకుల కోసం మే 30న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌లో తెలుగు వెర్షన్ టీజర్‌ను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. త్వరలోనే వారందరికీ ఆహ్వానాలు అందుతాయి. కన్నప్ప ప్రపంచాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇక వేచి ఉండలేను అని మంచు విష్ణు అన్నారు.