Page Loader
Kannappa : 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే.. ఎవరెవరు వస్తున్నారంటే..?
'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే.. ఎవరెవరు వస్తున్నారంటే..?

Kannappa : 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే.. ఎవరెవరు వస్తున్నారంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో, దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'కన్నప్ప' గురించి సినీ ప్రేమికులకు ముందుగానే తెలుసు. నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన తాజా సమాచారం బయటకు వచ్చింది. ఈ నెల జూన్ 21న హైదరాబాద్‌లో 'కన్నప్ప' కోసం గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు పూర్తి చేశారు.

వివరాలు 

ఇండస్ట్రీల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు

ఈ ఈవెంట్‌కి టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొననున్నట్టు సమాచారం. అంతేకాదు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరవుతారని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ సినిమాను జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.