NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kantara2 Movie : కాంతార-2లో నటించాలని ఉందా..అయితే ఈ లక్కీ ఛాన్స్ మీ కోసమే
    తదుపరి వార్తా కథనం
    Kantara2 Movie : కాంతార-2లో నటించాలని ఉందా..అయితే ఈ లక్కీ ఛాన్స్ మీ కోసమే
    కాంతార-2లో నటించాలని ఉందా..అయితే లక్కీ ఛాన్స్ మీ కోసమే

    Kantara2 Movie : కాంతార-2లో నటించాలని ఉందా..అయితే ఈ లక్కీ ఛాన్స్ మీ కోసమే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 12, 2023
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంతార 2 సినిమా ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ సైతం మొదలకానుంది.

    కాంతార ప్రీక్వెల్ (Kanthara-2) దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాకు కొత్త నటీనటులను ఎంచుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

    ఈ క్రమంలోనే ఆడిషన్స్ పెట్టి కొత్తమందికి అవకాశం ఇవ్వనున్నామని చిత్రబృందం వెల్లడించింది.

    ఇదే సమయంలో కన్నడలో రిషబ్ శెట్టి (Rishab Shetty), సప్తమి గౌడ (Sapthami Gowda) హీరో హీరోయిన్లుగా రిషబ్ శెట్టి స్వయం దర్శకత్వంలో రిలీజై భారీ విజయం సాధించింది.

    హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన కాంతార చిన్న సినిమాగా విడుదలై దాదాపు రూ.450 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సినీప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

    details

    వెబ్ సైట్'లో వివరాలు నమోదు చేయండి

    కేవలం రూ.20 కోట్ల బడ్జెట్'తో తెరకెక్కిన కాంతార (Kantara) సినిమా దక్షిణాది కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో సంచలనాత్మకమైన మూవీగా నిలిచింది.

    ఈ నేపథ్యంలోనే కాంతార సినిమాకి ప్రీక్వెల్'ను ప్రకటించింది చిత్ర నిర్మాణ బృందం.

    తాజాగా కాంతార-2 కోసం ఆడిషన్స్ ప్రకటించింది. ఇందుకోసం 30 నుంచి 60 ఏళ్ల మధ్యలో పురుషులు, 18 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళా ఆర్టిస్టుల కోసం వెతుకున్నారు.

    ఆసక్తి ఉన్నవారు https://www.kantara.film అనే వెబ్ సైట్'లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

    రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసే వాళ్లు వాటిని అప్లోడ్ చేయకండని సూచించారు. ఫలితంగా కాంతార-2లో నటించేందుకు యువ నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025