kanthara : కాంతార ఛాప్టర్-1లో రిషబ్ శెట్టి బిజీ, ప్రీక్వెల్'లో ఎంతమంది అగ్రహీరోలో తెలుసా
దక్షిణాది టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ప్రేక్షకుల అంచనాలకు అందకుండా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'కాంతార' సినిమా, బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతార ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్'గా 'కాంతార చాప్టర్ -1' తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇదివరకే ఫస్ట్ లుక్'తో సహా టీజర్' విడుదలయ్యాయి. ఫస్ట్ లుక్ టీజర్'కి ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. రిషబ్ శెట్టి లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు బలంగా నిలుస్తున్నాయి.
తాజా సినిమాలో 15 మందికిపైగా అగ్ర హీరోలు
'కాంతార' క్లైమాక్స్ సీన్‌తో ఫస్ట్ లుక్ టీజర్ ప్రారంభమైంది. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్ జన్మించాడు అంటూ కండలు తిరిగిన దేహంతో, ఒళ్లంతా రక్తపు మరకలతో బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో రిషబ్ కనిపిస్తున్నాడు. ప్రీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రిషబ్ తండ్రి జీవితాన్ని స్పర్శించనున్నారు. ఆయన చనిపోయాక ఎక్కడికెళ్లారు, ఆ ఊరి సంప్రదాయాలకు మూలం ఎక్కడ ఉంది, ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే దైవం ఎందుకు ఆవహిస్తోందన్న ఆసక్తికరమైన విషయాలను ఇందులో ప్రదర్శించనున్నారు. కాంతార చాప్టర్ -1'లో 15 మంది స్టార్ హీరోలు నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సహా పలు సినిమా పరిశ్రమలకు చెందిన 15 మందికి పైగా నటులను ఇందులో భాగంగా కానున్నట్లు తెలుస్తోంది.