Ranveer Singh: కాంతార మిమిక్రీ కేసు.. రణవీర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎదుర్కొంటున్న 'కాంతార' మిమిక్రీ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై, రిషబ్ శెట్టి నటనను అనుకరించే క్రమంలో రణవీర్ సింగ్ దైవ సంప్రదాయాన్ని అవమానించారని ఆరోపణలోచ్చాయి. దీనిపై బెంగళూరులో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణవీర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఆయనకు ఒక షరతు విధించింది. తన వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు ప్రాయశ్చిత్తంగా చాముండేశ్వరి ఆలయంను దర్శించుకోవాలని ఆదేశించింది.
వివరాలు
నాలుగు వారాలలోపు ఆలయాన్ని సందర్శించాలి
మైసూరులోని చాముండి కొండపై ఉన్న ఈ ఆలయాన్ని నాలుగు వారాల లోపు సందర్శించి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రణవీర్ సింగ్ బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తూ, తన ఉద్దేశ్యం ఎవరినీ అవమానించడం కాదని, కేవలం రిషబ్ శెట్టి నటనను ప్రశంసించడమేనని పేర్కొన్నారు. రణవీర్ ఆలయ దర్శనం పూర్తి చేసి, తన భక్తిని చాటుకున్న తర్వాత ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తుది తీర్పు ఇస్తామని జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం వెల్లడించింది. అలాగే ప్రజా వేదికలపై మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు మత, సంస్కృతి అంశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కోర్టు హితవు పలికింది. ఈ వివాదం సద్దుమణిగితే రణవీర్‌కు గణనీయమైన ఊరట లభించే అవకాశముంది.