ఆ సినిమా తీసినందుకు కరణ్‌కు సిగ్గుండాలి : నటి కంగనా రనౌత్
ఈ వార్తాకథనం ఏంటి
కరణ్ జోహర్ తెరకెక్కించిన 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని' చిత్రంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కరణ్ జోహర్ ను విమర్శిస్తూ ఆమె ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెట్టారు. ముఖ్యంగా రణబీర్ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రూ.250 కోట్లతో కరణ్ ఓ డౌలీ సీరియల్ తీశారని ఎద్దేవా చేశారు.
1990ల్లో వచ్చిన చిత్రాలను కాపీ కొట్టి రూ. 250 కోట్లతో ఈ సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలని, డబ్బును వృథా చేయడం మానేసి, రిటైర్ అయిపోవడం మంచిదని, కొత్తవారికి అవకాశాలకు ఇవ్వాలని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Details
కరుణ్ జోహర్ బాటలో రణబీర్ నడవకూడదని సూచించిన కంగనా రనౌత్
ప్రేక్షకులను ఇక మోసం చేయలేరని, ఇలాంటి ఫేక్ సెట్స్, కాస్ట్యూమ్స్‌ను వాళ్లు అంగీకరించరని, నిజ జీవితంలో ఎవరైనా అలాంటి దుస్తులు ధరిస్తారా అని కంగనా రనౌత్ ప్రశ్నించారు.
సాధారణ వ్యక్తుల మాదిరిగా దుస్తులు ధరించాలని, సౌత్ హీరోలు ఎలా రెడీ అవుతారో కనీసం వారిని చూసైనా నేర్చుకోవాలని ఆమె సూచించారు.
రణబీర్ సింగ్ కు ఓ చిన్న విన్నపమని, కరణ్ జోహార్ బాటలో రణబీర్ నడవకూడదని చెప్పారు.