
హ్యాపీ బర్త్ డే కార్తీ: పాత సినిమాలను మళ్ళీ గుర్తు చేస్తున్న కార్తీ సినిమా టైటిల్స్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు కార్తీ, తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన డైరెక్ట్ తెలుగు మూవీ ఊపిరి, మంచి విజయాన్ని అందుకుంది.
ఊపిరి తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించకపోయినా, అనువాదాల ద్వారా పలకరిస్తూ ఉన్నాడు. కార్తీ హీరోగా నటించిన తమిళ సినిమాలు, తెలుగులోకి అనువాదమైనపుడు వాటికి ప్రత్యేకమైన టైటిల్స్ కనిపిస్తుంటాయి.
ఆ టైటిల్స్ అన్నీ పాత తెలుగు సినిమాలను గుర్తు చేస్తుంటాయి. పాత తెలుగు సినిమాల టైటిల్స్ ని తన కొత్త సినిమాలకు పెడుతుంటాడు కార్తీ.
ప్రస్తుతం ఆ పాత సినిమాలేంటో, ఆ టైటిల్స్ తో కార్తీ ఎలాంటి సినిమాలు తీసాడో తెలుసుకుందాం.
Details
చిరంజీవి సినిమా టైటిల్స్ ని వాడుకున్న కార్తీ
ఖైదీ:
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఇది. ఈ చిత్ర టైటిల్ ని ఇంతవరకూ ఏ తెలుగు సినిమాకు కూడా పెట్టలేదు. మొదటిసారిగా కార్తీ సినిమా ఖైదీ పేరుతో తెలుగులోకి అనువాదమైంది.
ఈ సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ అందించారు. ప్రస్తుతం ఖైదీ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం గమనించాల్సిన విషయం.
దొంగ:
చిరంజీవి, రాధ హీరోయిన్లుగా నటించిన దొంగ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా టైటిల్ ని కార్తీ వాడుకున్నాడు. కార్తీ నటించిన దొంగ సినిమా, 2019లో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో జ్యోతిక కీలక పాత్రలో నటించింది.
Details
బాలకృష్ణ టైటిల్ ని వాడుకున్న కార్తీ
సుల్తాన్:
బాలకృష్ణ, రచన, దీప్తి భట్నాగర్ నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఇదే టైటిల్ తో కార్తీ సినిమా తీసాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
సర్దార్:
కృష్ణం రాజు హీరోగా మోహన్ బాబు, జయప్రద, శారద ప్రధాన పాత్రల్లో కనిపించిన సర్దార్ మూవీ 1984లో విడుదలైంది. సర్దార్ పేరుతో కార్తీ హీరోగా వచ్చిన సినిమా, 2022లో విడుదలైంది.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు.
కాష్మోరా:
రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ నటించిన ఈ చిత్రం తెరకెక్కింది. ఇదే టైటిల్ తో కార్తీ సినిమా విడుదలైంది.