
Sardar 2 : కార్తీ బర్త్‌డే బ్లాస్ట్.. 'సర్దార్ 2' నుండి మాస్ పోస్టర్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
కొలీవుడ్ నుంచి టాలీవుడ్‌లో భారీ స్టార్‌డమ్ సాధించిన హీరో కార్తీ 'యుగానికి ఒక్కడు' సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ తరువాత 'ఆవారా', 'నా పేరు శివ', 'ఖాకీ', 'ఖైదీ', 'పొన్నియన్ సెల్వన్' వంటి చిత్రాలతో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో 'సర్దార్' ఒక ముఖ్యమైన చిత్రం. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది.
ఈ చిత్రానికి సీక్వెల్ విడుదల కాబోతున్నది, ఇందులో కూడా పీఎస్ మిత్రన్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Details
కీలక పాత్రలో విజయ్ సేతుపతి
ఇందులో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నాడు.
ఇవి అన్నీ చెప్పుకొనే సమయంలో, కార్తీ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీ టీమ్ ఆయనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేసింది.
వారు విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో కార్తీ ఊహించని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు.
అతను గడ్డం పెంచుకుని, చెతిలో గన్ పట్టుకుని గ్యాంగ్‌స్టర్ పాత్రలో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ చాలా వైరల్‌గా మారింది.